ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. విశాఖ స్టేడియం వద్ద పలువురి అరెస్ట్

by Vemula.Srinu Prasad |

విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు...

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. విశాఖ స్టేడియం వద్ద పలువురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా(Team India), న్యూజిలాండ్(New Zealand) టీ ట్వంటీ మ్యాచ్(T-20 Match) ఈ సాయంత్రం 7 గంటలకు విశాఖ స్టేడియం(Visakha Stadium)లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్లందరూ స్టేడియంకు చేరుకున్నారు. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. టీ ట్వంటీ మ్యాచ్‌కు సంబంధించి ఆన్ లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసి కొందరు విశాఖ స్టేడియం వద్ద బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. రూ. 1200 టికెట్ ను రెట్టింపు ధరకు రూ. 2500కు రూ. 3000 టికెట్ ను రూ. 4 వేలకు అమ్ముతున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుల నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు మరింత ఫుల్ నిఘా పెట్టారు. బృందాలుగా విడిపోయి నగరంలో జల్లెడపడుతున్నారు.

నాలుగో టీట్వంటీ మ్యాచ్

కాగా న్యూజిలాండ్-భారత్ మధ్య ఐదు టీట్వంటీల సిరీస్ కోసం విశాఖలో నాలుగో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి నాలుగో విజయం కూడా నమోదు చేయాలని టీమిండియా ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ బ్లాక్ టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఆన్ లైన్ లో టికెట్ల కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే కొందరికి టికెట్ల దొరకలేదు. దీంతో విశాఖ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్లు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ పటిష్ట నిఘా పెట్టి బ్లాకులో టికెట్లు కొనుగోలు చేస్తున్న, అమ్మిన వారిని అదుపులోకి తీసుకుంటోంది.

Next Story