- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు దారుణం..
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నారని, తక్షణం స్పందించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం ఆదివారం డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది.

- తక్షణం స్పందించాలంటూ వైయస్ఆర్‌సీపీ వినతిపత్రం..
దిశ డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నారని, తక్షణం స్పందించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం ఆదివారం డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. గత నాలుగు రోజులుగా డీజీపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో వైయస్ఆర్‌సీపీ నేతలు నేరుగా డీజీపీ కార్యాలయంకు వెళ్ళారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు. దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికారపార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ ఇప్పటికైనా స్పందించి, ప్రజాస్వామ్యరక్షణకు, నిస్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా పార్టీ నేతలు వినతిపత్రంలో కోరారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రజా స్వామ్యానికే తలవంపులు తెచ్చేలా పోలీసుల తీరు ఉందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. రాజ్యాంగ స్పూర్తిని నీరుగారుస్తున్నారు అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.






