ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్: ఐదుగురు అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-03 15:05:35  IST  )

అన్నమయ్య జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌సాగిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిమ్మనపల్లి మండలానికి చెందిన ఐదుగురు యువకులు బెట్టింగ్ పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు...

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్: ఐదుగురు అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(annamaiah District)లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌(IPL Cricket Betting) సాగిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిమ్మనపల్లి మండలానికి చెందిన ఐదుగురు యువకులు బెట్టింగ్ పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో నిమ్మనపల్లికి చెందిన మహేంద్ర, వినయ్, రెడ్డిప్రసాద్, సాయి, హేమంత్‌లను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

భారీ మొత్తంలో నగదు

ఈ ఆపరేషన్‌లో నిందితుల నుంచి పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ. 3.59 లక్షలతో పాటు బెట్టింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తున్న ఐదు స్మార్ట్‌ఫోన్లనూ సీజ్ చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అధికారులు, నిందితులు కొంతకాలంగా ఆన్‌లైన్ యాప్స్ ద్వారా ఈ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు.

జూదంపై కఠిన ఆదేశాలు

క్రికెట్ జూదంపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అరెస్టయిన ఐదుగురు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. యువత ఇలాంటి వ్యసనాలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్‌లకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు..

Next Story