జగన్ గుంటూరు పర్యటన.. ఐదుగురు నేతలపై కేసులు నమోదు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-06 10:49:13  IST  )

రెండ్రోజుల క్రితం వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించగా ఆ పర్యటనలో పాల్గొన్న ఐదుగురు వైసీపీ కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

జగన్ గుంటూరు పర్యటన.. ఐదుగురు నేతలపై కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించగా ఆ పర్యటనలో పాల్గొన్న ఐదుగురు వైసీపీ కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ని అతిక్రమించి.. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు చేశారని వారిపై ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. హైవేతో పాటు నగరంలో ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారని పోలీసులు వెల్లడించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దొంతిరెడ్డి వేమారెడ్డి, పెదకాకాని పీఎస్ లో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, నల్లపాడు పీఎస్ లో బలసాని కిరణ్ కుమార్, నగరంపాలెం పీఎస్ లో నూరి ఫాతిమాపై, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి.

జగన్ పర్యటనలో వైసీపీ నేతలు ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడంతోనే కేసులు ఫైల్ అయ్యాయి. 40 నిమిషాల్లో గుంటూరు చేసుకోవాల్సిన జగన్.. ర్యాలీలు, నిరసనలతో 5 గంటలపాటు ప్రయాణించారని, జాతీయ రహదారులపై పెద్దఎత్తున వాహనాలు పెట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు పేర్కొన్నారు. మూడు గంటలపాటు గుంటూరు కాన్వాయ్ నిదానంగా ముందుకు సాగడంతో నగరవాసులు ట్రాఫిక్ కష్టాలను చూశారు. ఒకవైపు రహదారి నిర్మాణంలో ఉండగా.. ఒకే ఒక్క రోడ్డు అందుబాటులో ఉండటంతో పోలీసులు ఆంక్షలు విధించినా నగరవాసులకు వైసీపీ నేతలు ట్రాఫిక్ కష్టాలను చూపించారు.

మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Next Story