భూమన కరుణాకర్‌పై పోలీస్ కేసు నమోదు

by Naga Rani Yarlagadda |

మాజీ టీటీడీ ఈఓ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది. టీడీపీ నేత మహేశ్ యాదవ్.. భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భూమన కరుణాకర్‌పై పోలీస్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ టీటీడీ ఈఓ భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది. టీడీపీ నేత మహేశ్ యాదవ్.. భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాప్ ఛైర్మన్ రవినాయుడుపై భూమన దుష్ర్పచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. అలిపిరి రోడ్డులో షాపులు తొలగించడానికి, రవినాయుడికి ఏ సంబంధం లేదని, అయినా అంతా ఆయనే చేయించారని అసత్య ఆరోపణలు చేశారన్నారు. తమ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మహేశ్ యాదవ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. భూమన నోరును ఇకపై అయినా అదుపులో పెట్టుకోవాలని, అధికారం లేకపోవడంతో పిచ్చెక్కి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Next Story