- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు డోర్ తీయగానే ఘాటు వాసన.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ పదార్థం
కారులో గంజాయిని రాష్ట్రాన్ని దాటిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోటి విలువైన గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: కారు(Car)లో గంజాయి(Ganjai)ని రాష్ట్రాన్ని దాటిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోటి విలువైన గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మత్స్యపురం(Mastyapuram) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో నుంచి ఘాటు వాసన వస్తుండటంతో సోదాలు చేశారు. దాదాపు 200 కేజీల గంజాయిని గుర్తించారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ‘‘గంజాయి తరలింపు వెనుక ఎవరున్నారు..?, ఎక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు.?. అసలు ఈ వ్యవహారంలో ఎంత మంది ప్రమేయం ఉంది’’ అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గంజాయి సాగు చేయడం, అమ్మడం చట్టరీత్యా నేరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరంచారు.
Next Story






