బెట్టింగ్ యాప్స్ ప్రమోట్... నలుగురు టెలీకాలర్స్ అరెస్ట్

by Vemula.Srinu Prasad |

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నలుగురు టెలీకార్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు....

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్... నలుగురు టెలీకాలర్స్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నలుగురు టెలీకార్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్స్ మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విశాఖలోనూ బెట్టింగ్స్ యాప్‌పై తాజాగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరానికి చెందిన జె.ప్రవీణ్, మదీనపల్లి, రజియాబేగం, ధరణి కొంతకాలంగా బెట్టింగ్ వెబ్ సైట్లకు టెలీకాలర్స్‌గా పని చేస్తున్నారు. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిని విచారించి మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే సినీ, టీవీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. పలువురిని విచారించి అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలోనూ బెట్టింగ్ యాప్స్ ముఠా కర్యకలాపాలు కలకలం రేపాయి.

Next Story