- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.5 లక్షలకు పిల్లల విక్రయం.. బలగం సరోజిని గ్యాంగ్ మరోసారి అరెస్ట్
పిల్లల అక్రమ రవాణా కేసులో బలగం సరోజిని ముఠాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: పిల్లల అక్రమ రవాణా కేసులో బలగం సరోజిని ముఠాను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. నిందితులను నుంచి ఐదుగురు పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న పిల్లలను ఢిల్లీ, ముంబై నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. పిల్లలు లేని వాళ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గత మార్చిలో ఆరుగురు పిల్లలను విక్రయిస్తుండగా బలగం సరోజినిని అరెస్ట్ చేశారు. అయితే మరోసారి కూడా పిల్లలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమెతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 11 మంది పిల్లలను రక్షించామని తెలిపారు. అయితే పిల్లల విక్రయం చిన్న విషయం కాదని, మరింత లోతుగా విచారిస్తున్నామని తెలిపారు.
Next Story






