మహిళలపై రాళ్ల దాడి.. 9 మంది వైసీపీ నాయకుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-12 15:00:55  IST  )

పొదిలి ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు..

మహిళలపై రాళ్ల దాడి.. 9 మంది వైసీపీ నాయకుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పొదిలి(Podili)లో వైఎస్ జగన్(Ys Jagan) పర్యటన నేపథ్యంలో మహిళలపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా అమరావతి రైతులు, మహిళలపై సాక్షి ఛానల్‌(Sakshi Channel)లో సీనియర్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్(Kommineni Srinivas), జర్నలిస్ట్ కృష్ణంరాజు(Journalist Krishnam Raju) కించపరుస్తూ డిబేట్ చేశారని, అందుకు క్షమాపణలు చెప్పాలని జగన్ పర్యటన నేపథ్యంలో పొదిలిలో మహిళలు(Women), టీడీపీ కార్యకర్తలు(Tdp Follewers) నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నాయకులు, కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులతో పాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఏఎస్పీ కె. నాగేశ్వరరావు మీడియాకు వివరించారు.

Next Story