- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోళ్ల ఫామ్ కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. తిరుపతిలో 8 మంది అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయినా స్మగ్లర్లు వివిధ రూపాల్లో ఎర్రచందనాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఎర్రచందనం స్మగ్లింగ్(Red Sandalwood Smuggling)పై ప్రభుత్వం(Government)ఉక్కుపాదం మోపుతోంది. అయినా స్మగ్లర్లు వివిధ రూపాల్లో ఎర్రచందనాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సరే వెనక్కి తగ్గకుండా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించిన టన్నుల కొద్ది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు స్మగ్లర్లు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు పట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
తాజాగా తిరుపతిలో..
తాజాగా తిరుపతిలో 8 మంది అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులంతా ముఠాగా ఏర్పడి కర్ణాటకలోని హరత్నహళ్లిలో కోళ్ల ఫామ్ కేంద్రంగా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందటంతో దాడులు నిర్వమించారు. దీంతో రూ. 5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం దుంగలతో పాటు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆపరేషన్‌పై ముందుగానే సమాచారం అందడంతో ప్రధాని నిందితుడు, మరో ఇద్దరు వ్యక్తులు పరరాయ్యారు. అయితే 8 మంది అంతర్రాష్ట ముఠా సభ్యులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






