వైద్య పరీక్షలు పూర్తి.. రైల్వే కోడూరు కోర్టుకు పోసాని

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టుకు పోసానిని పోలీసులు తరలిస్తున్నారు..

వైద్య పరీక్షలు పూర్తి.. రైల్వే కోడూరు కోర్టుకు పోసాని
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఓబులవారిపల్లి పోలీసులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులు గురువారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ విచారించారు. ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పలు ప్రశ్నలు సంధించారు. అయితే అన్ని ప్రశ్నలకు పోసాని నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో పోసాని మాట్లాడిన వీడియోలు చూపించి అడిగిన ప్రశ్నలకు లవ్ యూ రాజా అంటూ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే గుర్తులేదు, తెలియదు, అవునా అంటూ పోసాని చెప్పిన సమాధానాలను పోలీసులు రికార్డు చేశారు. విచారణ అనంతరం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులకు వైద్యులు తెలిపారు. దీంతో రైల్వే కోడూరు కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. మరోవైపు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ధర్మాసనం ఎదుట వాడీ వేడీ వాదనలు జరగనున్నాయి. మరి పోసానికి బెయిల్ మంజూరు అవుతుందా..?, లేదా రిమాండ్‌కు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

Next Story