- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య సూసైడ్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. భర్త ఫోన్లో ఆ వీడియోస్ చూసి ఖంగుతిన్న పోలీసులు
పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త(Husband Addicted to Porn) తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నం(Visakhapatnam)లోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త(Husband Addicted to Porn) తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన విశాఖపట్నం(Visakhapatnam)లోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. నాగేంద్రబాబు అనే వ్యక్తికి గాజువాక ప్రాంతానికి చెందిన ఓ యువతితో 2024 మార్చిలో వివాహమైంది. నాగేంద్రబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఉంటారు. పెళ్లయిన కొన్ని రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకు నాగేంద్రబాబులోని అసలు మనిషి బయటకు వచ్చాడు.
గత కొన్ని నెలలుగా భార్యను వేధించడం మొదలెట్టాడు. ఆన్ లైన్‌లో పోర్న్ వీడియోలు చూసే అలవాటున్న నాగేంద్రబాబు.. వాటికి బానిస గా మారిపోయాడు. పోర్న్ వీడియోల తరహాలోనే తనతో ఉండాలంటూ భార్యను వేధించడం మొదలెట్టాడు. అయితే ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. చివరకు ఈ వేధింపులు ఎక్కువ కావటంతో వీటిని భరించలేక గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతని పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో నవవధువు ఆత్మహత్య(Suicide) కేసులో భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతని మొబైల్ సీజ్ చేశారు. ఈ క్రమంలో అతని మొబైల్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వందలాది పోర్న్ వీడియోలు, గూగుల్ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం వెతికినట్లు తేలింది. పెళ్లయిన నెల నుంచి వేధింపులు మొదలయ్యాయని.. వయాగ్రా వాడుతూ, పోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలని భార్యను వేధించే వాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.






