పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి.. మాజీ సీఎం జగన్ ​ఆరోపణలు

by Thanuru Gopichand |

ద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని,

పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి.. మాజీ సీఎం జగన్ ​ఆరోపణలు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ‘చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి’. అంటూ మాజీ సీఎం వైఎస్​జగన్​తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానా ల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అని ఆయన ఓ ట్వీట్​చేశారు. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వం దలమంది వైయస్సార్‌సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్‌ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్‌ చేసి, వైయస్సార్‌సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల పోలింగ్‌ రోజున, ఓటింగ్‌ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్‌ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించ కుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారని జగన్​పేర్కొన్నారు. లైవ్‌ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది... అని ఆయన ఆ ట్వీట్​లో పేర్కొన్నారు.

https://x.com/ysjagan/status/1954486299538473446?t=Ejhrjr8Quhz96299BVOS6w&s=19

Next Story