- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం ప్రాజెక్టు పనులు 88 శాతం పూర్తి చేశాం : మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పురోగతిపై కీలక వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు పనులను 88 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే జరిగితే, ప్రస్తుత ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 12 శాతం పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైట్ కనెక్టివిటీస్‌లో 82 శాతం, లెఫ్ట్ కనెక్టివిటీస్‌లో 62 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు.
డయాఫ్రంవాల్ నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇప్పటివరకు 950 మీటర్ల డయాఫ్రంవాల్ నిర్మాణం జరిగి, వాల్ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వర్షాకాలంలోనూ పనుల వేగాన్ని తగ్గించకుండా బట్రస్ డ్యామ్ పూర్తి చేసి వేగవంతం చేశామని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త డయాఫ్రంవాల్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు అండగా నిలబడి, తొలి ఏడాదిలోనే రూ.2 వేల కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు.
జగన్ పాలనలో విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరిగి ట్రాక్‌లో పెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టులో ఎడమ ప్రధాన కాల్వ పనులను పూర్తి చేసి, 2026 నాటికి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.






