ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్: పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు ముందస్తు హెచ్చరికలు

by Vemula.Srinu Prasad |

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరుగుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్ సరిహద్దు ప్రాంతాలపై పడే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్: పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు ముందస్తు హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరుగుతున్న మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్ సరిహద్దు ప్రాంతాలపై పడే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధులకు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు(Polavaram MLA Chirri Balaraju) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు చేయొద్దని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరూ రావొద్దని, ఫోన్‌లోనే సంప్రదించాలని బాలరాజు కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఎమ్మెల్యే బాలరాజు నివాసం ఏజెన్సీ ఏరియా బుట్టాయగూడెం మండలం బర్రింకలపాడులో ఉండటంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు.

Next Story