Polavaram : పోలవరానికి అధిక ప్రాధాన్యం

by Thanuru Gopichand |

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువలు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Polavaram : పోలవరానికి అధిక ప్రాధాన్యం
X

మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు

దిశ, డైనమిక్ ​బ్యూరో : చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువలు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నా రు. పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ (Sir Arthur Thomas Cotton) జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు. ఆనాడు ఆంగ్లేయుడైన మహానుభావుడు ఆర్ధర్ కాటన్ ముందు చూపుతో ధవలేశ్వరం ఆనకట్ట తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేశాడని తెలిపారు. గత జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసంతో కాటన్ దొర ఆత్మ సైతం క్షోభిస్తుందన్నారు.

చంద్ర బాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువలు పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా శ్రమిస్తున్నా రని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సాగు, త్రాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట కాలవలు, మురుగు డ్రైన్ల మెయింటినెన్స్ పనులకు సీఎం చంద్రబాబు రూ.344 కోట్లను కేటాయించినట్లు మాట్లాడారు. త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story