మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. నారాయణ రావుపై పోక్సో కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-22 11:17:20  IST  )

కాకినాడ జిల్లా తుని(Tuni)లో గురుకుల పాఠశాల బాలికను తీసుకెళ్లిన నారాయణరావు అనే వ్యక్తి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. నారాయణ రావుపై పోక్సో కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని(Tuni)లో గురుకుల పాఠశాల బాలికను తీసుకెళ్లిన నారాయణరావు అనే వ్యక్తి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గురుకుల పాఠశాల(gurukula School) విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన షాక్‌కు గురిచేసిందని తెలిపారు. అలాగే నింధితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై డీఎస్పీ శ్రీహరి రాజు (DSP Srihari Raju) మీడియాతో స్పందించారు.

మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నారాయణ రావుపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఈరోజు సాయంత్రం నారాయణ రావును కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకు తెలిపారు. అలాగే ఈ అత్యాచారయత్న ఘటనకు పార్టీల ప్రమేయం లేదని, నిందితుడైన నారాయణ రావును ఏ పార్టీ కూడా తమ వాడని క్లెయిమ్ చేయలేదని, సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు వీడియోలు సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీహరి రాజు హెచ్చరించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More: తునిలో విద్యార్థినిపై అత్యాచారయత్నం.. ఘటనపై స్పందించిన లోకేశ్

Next Story