- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు
by Ajay Maddhiboyina |
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఓ యువకుడు గర్భవతిని చేసి ఆ తరవాత ముఖం చాటేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఓ యువకుడు గర్భవతిని చేసి ఆ తరవాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడు బాలిక 7 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. బాలిక కులం తక్కువ అని నిందితుడు పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు నిందితుడు అనుచరుడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతోనే ఫిర్యాదు చేసినా కేసు ఆలస్యంగా నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ దివ్య... బాలిక కోరిక మేరకే కేసు నమోదు చేయడం ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నారు.
Next Story






