- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Narendra Modi:‘ఒక్క ఏపీకే రూ.9 వేల కోట్ల నిధులు ఇచ్చాం’.. కీలక విషయాలు వెల్లడి
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శుక్రవారం) శంకుస్థాపన చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని పీఎం మోడీ పేర్కొన్నారు. ఇది తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి సాయం చేస్తుందన్నారు. ఒకప్పుడు ఏపీ, తెలంగాణ(Telangana)కు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్ల లోపే ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడు ఒక ఏపీకే రూ.9 వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చామని ప్రధాని మోడీ(PM Narendra Modi) సభలో తెలిపారు.
ఏపీ(Andhra Pradesh)లో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రక్షణ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు. నాగాయలంకలో టెస్టింగ్ రేంజి దుర్గామాత లాగా భారత రక్షణ రంగానికి శక్తిని ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కలలు కనే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. వాటిని నెరవేర్చే వారి సంఖ్య కూడా ఎక్కువే అని పీఎం మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ(AP Government) హయాంలో ఆంధ్రప్రదేశ్ సరైన మార్గంలో నడుస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలని ప్రధాని మోడీ సూచించారు.






