- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి మోడీ.. పరేడ్ గ్రౌండ్ సభ అనంతరం పరామర్శ..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ ఇంటిలో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) నివాసానికి ప్రధాని మోడీ(Pm Modi) వెళ్లనున్నారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్(Hyderabad) ఇంటిలో పవన్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తాజాగా ప్రధాని మోడీ హైదరాబాద్‌లో ఆదివారం పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రసంగం అనంతరం పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2014లో బీజేపీ-టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు. 2024లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో పవన్ కల్యాణ్‌పై ప్రధాని మోడీకి అభిమానం ఏర్పడింది. రాజకీయంగా పవన్ వ్యహరించే తీరును కూడా పలు సందర్భాల్లో ప్రశంసించారు. కొన్ని సభలో మిత్రుడు అంటూ కూడా సంభోదించారు. మిత్రబంధాన్ని పలుమార్లు ప్రధాని మోడీ కొనియాడారు.
చిరంజీవి సైతం మీట్
అయితే ఆకస్మికంగా పవన్ కల్యాణ్ శస్ట్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించాలని మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పవన్ నివాసానికి వెళ్తారని సమాచారం. ఇదే సమయంలో ప్రధాని మోడీని మెగాస్టార్ చిరంజీవి సైతం కలుస్తారని తెలుస్తోంది.
పటిష్ట భద్రతలో హైదరాబాద్
మరోవైపు ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోంది.






