- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఏపీ పర్యటన...తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోడీ
ఆంధ్రప్రదేశ్లో మోడీ రేపు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. రేపు తాను ఏపీలో పర్యటిస్తున్నానని

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. రేపు తాను ఏపీలో పర్యటిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ పర్యటనలో భాగంగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తానని తెలిపారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని పోస్ట్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవని వెల్లడించారు. ఇక అటు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. గురువారం రోజున ఉదయం 7:20 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు ప్రధాని నరేంద్ర మోడీ. సరిగ్గా 9.50 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 10:55 గంటలకు శ్రీశైలం చేరుకుని శ్రీ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కర్నూలుకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఏడు గంటల సమయానికి మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారు మోడీ. క్లిక్






