సీఎం చంద్రబాబు పాలనను ప్రశంసించిన ప్రధాని మోడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-11 14:55:37  IST  )

సీఎం చంద్రబాబు పాలనను ప్రధాని మోడీ ప్రశంసించారు....

సీఎం చంద్రబాబు పాలనను ప్రశంసించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాలనను ప్రధాని మోడీ(Pm Modi) ప్రశంసించారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి, నియోజకవర్గాలపై టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. ఈ భేటీ అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం నుంచి సహకారం కొనసాగుతుందని మోదీ చెప్పినట్లు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఆ తర్వాత కేంద్రహోంమంత్రి అమిత్ షాను సైతం మాజీ ఎంపీలతో కలిసి తాజా ఎంపీలు కలిశారు. అమిత్ షాకు వారిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయడు పరిచయం చేశారు. రాష్ట్ర విభజన, పెండింగ్ అంశాలు, ఇతర విషయాలపైనా చర్చించారు.

Next Story