శ్రీశైలంలో మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్..షెడ్యూల్ ఇదే

by velandi.Saikiran |

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ ఖరారు అయింది. రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పు

శ్రీశైలంలో మోడీ  కాన్వాయ్ ట్రయల్ రన్..షెడ్యూల్ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ ఖరారు అయింది. రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట‌నున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యంగా రేపు శ్రీశైలం రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ తరుణంలో శ్రీశైలంలో ప్రధాని మోడీ కాన్వాయ్ ట్రయల్ రన్ జరిగింది. ట్రయల్ రాన్ సందర్భంగా రెండు గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గాలలో వాహన రాకపోకలను నిలిపివేశారు. రూట్ క్లియరెన్స్ చేపట్టారు పోలీసులు. భద్రతా విభాగం, పోలీస్ శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఏ చిన్నపాటి అల్లరి జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, సిద్ధంగా ఉన్నారు అధికారులు.

ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే... 16వ తేదీ అంటే రేపు ఉదయం 7:20 నిమిషాలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరుతారు. సరిగ్గా 9 గంటల 50 నిమిషాలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 10 : 55 గంట‌ల‌కు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం శ్రీశైలంలో 11 : 15 నిమిషాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల‌ను దర్శించుకుంటారు. ఆ తర్వాత భ్రమరాంబ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కర్నూలు వెళ్తారు. ఇక సాయంత్రం ఏడు గంటల 10 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు.




Next Story