ఏపీపై సైక్లోన్ ఎఫెక్ట్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-27 07:27:53  IST  )

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలపై మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావం మొదలైంది.

ఏపీపై సైక్లోన్ ఎఫెక్ట్.. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలపై మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావం మొదలైంది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రానికి ఈ వర్షాలు మరింత పెరుగుతాయని, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థలు సూచించాయి. కాగా.. తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆర్టీజీఎస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గంటకు తుపాను కదలికలను గమనిస్తుండాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహార పానీయాలను అందించే విషయాలపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాలకు మోహరించాలని సూచించారు.

మొంథా తుపాను ప్రభావం గురించి ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) సీఎం చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించడంతో.. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ (Nara Lokesh)కు ఆదేశాలు జారీ చేశారు. తుపాను సహాయక చర్యలపై ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Read More: శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకూ రెడ్ అలర్ట్.. "మొంథా" అంటే అర్థమేంటో తెలుసా?

Next Story