Breaking:మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని.. ఐదుగురు మంత్రులతో నిర్వాహక కమిటీ

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న(శుక్రవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే

Breaking:మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని.. ఐదుగురు మంత్రులతో నిర్వాహక కమిటీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న(శుక్రవారం) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌ ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌’. యోగా డే రోజు ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నెల(మే) 21 నుంచి జూన్‌ 21 వరకు ‘యోగా మంత్‌’ పాటించాలని తెలిపారు. అయితే.. ఏపీలోని విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా డే కార్యక్రమంలో జూన్‌ 21న ప్రధాని మోడీ(PM Narendra Modi) పాల్గొంటున్నారు.

ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రధాని పర్యటన దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూచించారు. ఈ క్రమంలో వరల్డ్ యోగా డే సందర్భంగా జూన్ 21న విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఐదుగురు మంత్రులతో నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. హోం శాఖ, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబును నియమించారు.

Next Story