నా భార్యను రక్షించి కువైట్ నుంచి రప్పించండి.. సీఎం చంద్రబాబుకు భర్త రిక్వెస్ట్

by Ajay Maddhiboyina |

కులైట్‌లో యజమానుల చేతిలో బందీగా మారిన తన భార్యను విడిపించాలని ఓ భర్త సీఎం చంద్రబాబును వేడుకున్నారు.

నా భార్యను రక్షించి కువైట్ నుంచి రప్పించండి.. సీఎం చంద్రబాబుకు భర్త రిక్వెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: కులైట్‌లో యజమానుల చేతిలో బందీగా మారిన తన భార్యను విడిపించాలని ఓ భర్త సీఎం చంద్రబాబును వేడుకున్నారు. ఏపీకి చెందిన మర్రిపూడి సుమ అనే మహిళ మూడు నెలల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. అక్కడ అనారోగ్యం పాలవ్వడంతో ఇంటికి వస్తానని చెప్పగా, ఆ విషయం యజమానులకు తెలియడంతో అక్కడే బంధించారు.

దీంతో బాధితురాలి భర్త మర్రిపూడి వెంకటరమణ తన భార్యను ఎలాగైనా యజమానుల నుండి విడిపించి ఇండియాకు రప్పించాలని సీఎం చంద్రబాబును మీడియా ద్వారా వేడుకున్నారు. ఏజెంట్ ను సంప్రదించగా రూ.లక్షన్నర కడితేనే సుమ ఇండియాకు వస్తుందని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి జాడ తెలియక తమ ముగ్గురు బిడ్డలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి తన భార్యను రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

Next Story