‘నన్ను కాపాడండి ప్లీజ్’.. మహిళ తీవ్ర ఆవేదన

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-17 11:22:33  IST  )

బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

‘నన్ను కాపాడండి ప్లీజ్’.. మహిళ తీవ్ర ఆవేదన
X

దిశ,వెబ్‌డెస్క్: బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉపాధి కోసం వెళుతున్న ఎంతో మంది యువతి, యువకులు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కువైట్ నుంచి సోషల్ మీడియాలో ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బతుకుదెరువు నిమిత్తం కువైట్‌కు వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యత తన పై పడింది.

ఈ క్రమంలో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. పీలేరుకు చెందిన సురేష్ అలియాస్ స్వరాజ్ అనే ఏజెంట్ ద్వారా మే 27న కువైట్‌ చేరారు. ఈ క్రమంలో ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లిన ఆ మహిళ జీవితం తలకిందులైంది. అక్కడి యజమానులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుతూ.. చిత్రహింసలు పెడుతున్నారని తెలిపింది. ఈ క్రమంలో తనని ఆ నరకం నుంచి విడిపించాలని ఏపీ మంత్రి నారా లోకేష్‌ను వేడుకుంది.

అయితే, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. ఈ తరుణంలో ఇటీవల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కువైట్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన పలువురిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Next Story