- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: జగన్‌కు భద్రత పెంచండి.. కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్రహోంశాఖకు లేఖ రాసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్రహోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల జగన్ పర్యటనల్లో పోలీసులు లాస్ట్ మినిట్ లో వారి ఇష్టానుసారం ప్లాన్ చేస్తున్నారని, దీనివెనుక ఏదో కుట్ర ఉన్నట్లు తమకు అనుమానంగా ఉందని పేర్కొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జగన్ కు జెడ్ ప్లట్ కేటగిరీ భద్రత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కోరారు.
ఫిబ్రవరి 6వ తేదీన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్ వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని పేర్కొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూటును కాదని, 47 కిలోమీటర్ల దూరమున్న మార్గాన్ని పోలీసులు సూచించడం పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. జగన్ సెక్యూరిటీకి, పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా రూట్ మ్యాప్ మార్పడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయన్నారు. గతంలోనూ పలుమార్లు జగన్ పర్యటనలో భద్రతా లోపాలు జరిగాయని తలశిల లేఖలో పేర్కొన్నారు.






