మా బాబుకీ పునర్జన్మ ప్రసాదించండి.. ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు

by Vemula.Srinu Prasad |

విజయనగరానికి చెందిన వెంకటేష్, అనూష దంపతులు తమ రెండు నెలల పసికందును కాపాడుకోవడానికి ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు....

మా బాబుకీ పునర్జన్మ ప్రసాదించండి.. ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరానికి(Vizianagaram) చెందిన వెంకటేష్, అనూష దంపతులు తమ రెండు నెలల పసికందును కాపాడుకోవడానికి ప్రభుత్వం(Government) సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాణాంతకమైన 'ఎస్.ఎం.ఏ టైప్-1' (SMA Type-1) వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే సుమారు రూ. 8 లక్షల వరకు ఖర్చు చేసిన ఆ తల్లిదండ్రులు, బాబు ప్రాణం నిలవాలంటే రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

మా పసికందును ఆదుకోండి...

ఇటీవల పునర్విక అనే పాపకు ప్రభుత్వం దాతల సహకారంతో చికిత్స అందించి ప్రాణం పోసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తమ బాబుకు కూడా పునర్జన్మ ప్రసాదించాలని ఈ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంత భారీ మొత్తాన్ని తాము భరించలేమని, ప్రభుత్వం ఉదారంగా స్పందించి తమ పసికందును ఆదుకోవాలని వారు కన్నీటితో అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే తమ బిడ్డ ప్రాణాలు దక్కుతాయని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story