రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలు : సీఎం

by Thanuru Gopichand |

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు (Sanjeevani Project) అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలు : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు (Sanjeevani Project) అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమీక్షలో భాగంగా కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సిటీ హెల్త్ స్కీం గురించి చర్చించారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో పథకం అమలు కానున్న నేపథ్యంలో.. అక్కడ విజయవంతమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ

ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందులల్లో మెడికల్ కాలేజీలను తొలి విడతలో నిర్మించనున్నారు. పీపీపీ ప్రాతిపదికన చేపట్టనున్న ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడారు. విద్యార్థులు, ప్రజలు, సామాజిక ప్రయోజనాలను ఆశించి మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోందన్నారు. పీపీపీ విధానంలోనే బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

బ్లూ ఎకనామీలో ముందు నిలిపాయి

ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులు, ఆక్వా రైతులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలోనూ మత్స్య రంగానిదే అగ్ర వాటాగా పేర్కొన్నారు. దీనికి మరింత మద్దతిచ్చేలా మత్స్యకారులకు, ఆక్వారైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం అన్నారు. వేట నిషేధ సమయంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద 1,29,178 మందికి రూ.20,000 చొప్పున ఆర్థికసాయంగా రూ.259 కోట్లు అందించామని వెల్లడించారు. గంగపుత్రులు కోరుకున్నట్టుగా 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించామి గుర్తు చేశారు. ఆక్వారంగం బలోపేతానికి రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్వారంగాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని మాటిచ్చారు.

Next Story