జగన్‌కు బిగ్ షాక్.. తక్షణమే ఆ కార్యక్రమం నిలిపివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-05 15:35:59  IST  )

జగన్‌కు బిగ్ షాక్.. తక్షణమే ఆ కార్యక్రమం నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(Former Chief Minister of the State YS Jagan)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన అమలు చేసిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’(Gadapa Gaadapku Mana Prabuthvam) కార్యక్రమాన్ని తక్షణమే నిలివేస్తూ ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అప్పటి సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. తమ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ పని తీరును తెలుసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో పరాభవం ఎదురైంది. పలుచోట్ల స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకత ఉందో పార్టీ అధినేత జగన్‌కు స్పష్టంగా తెలిసిసోయింది. ఈ మేరకు చాలా ఎమ్మెల్యేలను 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయించారు. కానీ ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగి ఏడు నెలలు అవుతోంది. జగన్ అమలు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014-19 సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పలు పథకాలను 2019-2024 హయాంలో జగన్ కూడా తొలగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్‌కు బిగ్ షాక్ తగిలిందని సెటైర్లు వేస్తున్నారు.

Next Story