నేను వెళ్ళిపోవాలా? పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ అసహనం!

by Ajay Maddhiboyina |

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌కు

నేను వెళ్ళిపోవాలా? పవన్ పిఠాపురం పర్యటనలో వర్మ అసహనం!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌కు వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు అందించే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. కాగా ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ కూడా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటూ కొంత‌మంది టీడీపీ నేత‌లు సైతం ప‌వ‌న్ ను క‌లిసేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో అక్క‌డే ఉన్న పోలీసు అధికారులు కేవ‌లం వ‌ర్మ‌ను మాత్ర‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కలిసేందుకు అనుమతించారు. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు.

తన అనుచరులను కూడా పవన్ కల్యాణ్ వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని అన్నారు. లేదంటే వెళ్లిపోతానని హెచ్చరించారు. దీంతో ఎస్పీ బిందుమాదవ్ ఆయనకు నచ్చబెప్పి పవన్ కల్యాణ్ వద్దకు తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే వర్మ పవన్ కల్యాణ్ కోసం తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. కానీ పిఠాపురంలో టీడీపీని పట్టించుకోవడంలేదని గత కొద్దిరోజులుగా అక్కడి నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అప్పటి నుండి వర్మ అసంతృప్తితోనే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Next Story