- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట.. అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు
పిన్నెల్లి సోదరులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: పిన్నెల్లి సోదరులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. పల్నాడు (Palnadu) జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ (TDP) నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం కలిస్పూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయతే, ఇదివరకు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామి రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు పిన్నెల్లి సోదరులు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం వారిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై మే 25న కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో A1xe జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు.






