- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ డిస్మిస్
పిన్నెల్లి సోదరులకు ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: పిన్నెల్లి సోదరులకు ఊహించని షాక్ తగిలింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదైన విషయంలో తెలిసిందే. అయితే, పోలీసులు తమపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ.. పిన్నెల్లి సోదరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్‌పై విచారణ చేపట్టి.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పును వెలువరిచింది.
కాగా, పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై మే 25న కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో A1xe జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని చేర్చారు.






