- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Assembly: ఏపీ అసెంబ్లీ ఆవరణలో.. పిక్ పాకెటర్స్?
దొంగలు ఉన్నారు.. జాగ్రత్త.. ఇది ఏ రైల్వే స్టేషన్, బస్టాండులో కాదంటీ.. ఏకంగా ఏపీ అసెంబ్లీలోనే..

నేతల జేబుల్లోనే కొట్టేశారు..
ఏకంగా నాలుగు లక్షలు చోరీ
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో : దొంగలు ఉన్నారు.. జాగ్రత్త.. ఇది ఏ రైల్వే స్టేషన్, బస్టాండులో కాదంటీ.. ఏకంగా ఏపీ అసెంబ్లీలోనే..! (Ap Assembly)) కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ఆవరణలో దొంగలు (Pickpockets) చొరబడ్డారు. బుధవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంలో నేతల వద్ద సుమారు రూ.4 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు వీడియో బయట వస్తే దొంగలు ఎవరో బయటపడతారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. స్వయానా ఏపీ అసెంబ్లీలోనే ఇటువంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నేతల జేబుల్లోనే డబ్బు కొట్టేయడం అసెంబ్లీలో భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని పలువురు భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇంతకు ముందు ఇటువంటి ఘటనలు జరగలేదని అంతా చర్చించుకుంటున్నారు.






