ATM's Closed rumors: ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వదంతులు.. వాటిని నమ్మవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్​చెక్​

by Thanuru Gopichand |   (  Updated:2025-05-09 05:32:12  IST  )

భారత్​ పాకిస్తాన్​మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారంటూ ఓ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ATMs Closed rumors: ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వదంతులు..  వాటిని నమ్మవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్​చెక్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : భారత్​ పాకిస్తాన్​మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూసివేస్తారంటూ ఓ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్​మనపై సైబర్​దాడికి సిద్ధం అవుతోందని దీంతో ఏటీఎంలు మూసివేస్తారని దీని సారాంభం. ఈ వందంతుల నమ్మవద్దంటూ పీఐబీ (ప్రెస్​ఇన్ఫర్​మేషన్​బ్యూరో) PBI Fact Check ఫ్యాక్ట్​చెక్​తన ట్విట్టర్​ఖాతాలో పోస్టు చేసింది. ఈ రోజు ఎటువంటి నగదు ట్రాన్సాక్షన్స్​చేయవద్దంటూ వైరల్​ అవుతున్న ఆ వాట్సప్​పోస్టులో పేర్కొన్నారు. మొత్తం 74 దేశాల్లో ఇటువంటి సైబర్​ఎటాక్​లు జరుగుతాయంటూ ఫేక్​ప్రచారాన్ని చేశారు. ఈ వార్తలను పీఐబీ పూర్తిగా ఖండించింది. ఇది ఫేక్​మెసేజ్​ అని .. ఎవరూ దీనిని నమ్మవద్దంటూ పేర్కొంది. ఏటీఎంలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఇటువంటి ప్రచారాలను ఎవరూ సోషల్​మీడియాలో షేర్​చేయవద్దని సూచించింది.

https://x.com/PIBFactCheck/status/1920698826559512595?t=PYVkyCgvTt7cMoS9j53i2w&s=19

Next Story