- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ పక్కాగా జరిగింది.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు. ఇవాళ ఆమె విశాఖపట్నం (Vishakhapatnam) ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తన ఫోన్ ట్యాపింగ్ చేసిందనే విషయం పచ్చి నిజమని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తన ఫోన్‌తో పాటు తన భర్త అనిల్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో అత్యంగా కీలకంగా వ్యహరించిన వైవీ సుబ్బారెడ్డి ఆ విషయాన్ని ధృవీకరించారని, ట్యాపింగ్‌లో భాగంగా తన వాయిస్ ఉన్న ఓ ఆడియోను కూడా తనకు స్వయంగా వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ (KCR) సంబంధాన్ని చూసి తన రక్త సంబంధం కూడా చిన్నబోయిందంటూ కామెంట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా తెలంగాణ (Telangana)లో తనను పొలిటికల్, ఫైనాన్షియల్‌గా ఎదగనివ్వకుండా నాడు రెండు రాష్ట్రా ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఆరోపించారు. తనను బలపరిచిన వాళ్లను ఒక్కొక్కరిని దూరం చేశారని.. చివరికి అక్కడ పార్టీ లేకుండా కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజకీయ శక్తిగా ఎదగనివ్వకుండా కేసీఆర్ (KCR) అడుగడుగునా అడ్డుపడ్డారని. రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వకుండా తనపైకి పోలీసులను ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. జగన్, కేసీఆర్ చేసినవి మాములు అరాచకాలు కావని వైఎస్ షర్మిల అన్నారు.






