- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kadiri: యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు.. కారణం ఇదే..?
సత్యసాయి జిల్లాలో పెట్రోల్ బంకు సిబ్బంది దారుణంగా వ్యవహరించింది...

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు మానవత్వం మంటగలిచిపోతోంది. తోటి మనిషి అని కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు. డబ్బుల విషయంలో అయితే మరీ క్రూరత్వంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటన సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో జరిగింది. కుమ్మరవాండ్లపల్లిలో వైసీపీ నేత బత్తల హరిప్రసాద్‌కు పెట్రోల్ బంకు ఉంది. ఈ బంకులో బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి పంపు బాయ్‌గా పని చేస్తున్నారు.
అయితే రోజు మాదిరి పెట్రోల్ అమ్మగా వచ్చిన డబ్బులను మేనేజర్‌కు అప్పగించారు. అందులో డబ్బు కొంత తగ్గినట్లు గుర్తించారు. దీంతో మేనేజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంకు డబ్బులు వాడుకుంటావా అంటూ అతడిని అర్ధనగ్నంగా చేసి స్థంభానికి కట్టేసి కొట్టారు. కొంత సమయం ఇవ్వాలని డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. బంకు మేనేజర్‌తో పాటు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






