- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో తీరిన 'పెట్రోల్, డీజిల్' కష్టాలు.. 90% బంకుల్లో ఇంధన సరఫరా పునరుద్ధరణ!
ఏపీలో పెట్రో కష్టాలు తీరాయి! 90% బంకుల్లో సాధారణ స్థితి. ప్యానిక్ కొనుగోళ్లు వద్దు.. రైతులకు ప్రత్యేక కూపన్ల ద్వారా డీజిల్ సరఫరా.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాహనదారులను ఆందోళనకు గురి చేసిన పెట్రోల్, డీజిల్ సమస్య (Petrol and diesel problem) నేటితో ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ (Fuel supply system) తిరిగి గాడిలో పడటంతో రాత్రి 7 గంటల సమయానికి దాదాపు 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. చమురు సంస్థలు అర్ధరాత్రి నుంచే నిరంతరాయంగా ట్యాంకర్ల ద్వారా నిల్వలను పంపడంతో బంకుల వద్ద వాహనాల రద్దీ గణనీయంగా తగ్గింది. ఇంధన కొరత లేదని ప్రభుత్వం, అధికారులు పదేపదే స్పష్టం చేయడంతో ప్రజల్లో 'ప్యానిక్' కొనుగోళ్లు తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చిందని బంక్ యజమానులు వెల్లడించారు.
ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వరి కోతలు, ఆక్వా రంగం అవసరాల కోసం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కూపన్లు జారీ చేస్తూ డీజిల్ సరఫరాను క్రమబద్ధీకరించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బాటిళ్లు, టిన్నులు లేదా ప్లాస్టిక్ క్యాన్లలో ఇంధనం పోయడాన్ని అధికారులు కఠినంగా నిషేధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.






