- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్ల చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు.. కనిపించిన పెంపుడు కుక్క
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మూడో రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మూడో రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ అన్వేషణలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరిగొచ్చిన పెంపుడు కుక్క
పాప ఆచూకీ కోసం ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF), అటవీశాఖ మరియు స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో కొండ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. పాపతో పాటే అదృశ్యమైన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా కిందకు రావడాన్ని పోలీసులు, స్థానికులు గుర్తించారు.
దాడి చేసి పరారీ.. కొండపైకి అన్వేషణ
ఆ శునకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది పలువురిపై దాడి చేసి, కరిచి తిరిగి కొండపైకి పరుగులు తీసింది. పెంపుడు కుక్క వెళ్లిన మార్గంలోనే పాప జాడ దొరుకుతుందన్న ఆశతో.. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ కుక్కను అనుసరిస్తూ కొండపైకి వెళ్లి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఈ పరిణామంతో చిన్నారి ఆచూకీపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు, స్థానికులు ఆశిస్తున్నారు. కాగా, మూడు రోజులుగా సీహెచ్ అగ్రహారం గ్రామంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం సంచలనం రేపింది. సుంకర గణేష్ భవాని దంపతులు 20 ఏళ్లుగా సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. చుట్టూ కొండలు, తోటల మధ్య ఉన్న ఒకే ఒక్క ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. రెండేళ్ల జ్ఞానేశ్వరి, మరో ఏడు నెలల చిన్నారితో కలిసి కుటుంబం అక్కడే ఉంటుంది. ఈ క్రమంలోనే శనివారం ఒక్కసారిగా చిన్నారి కనిపించకుండా పోయింది. చివరగా శనివారం ఉదయం 11 గంటలకు పొలాల్లో ఉన్న సీసీ కెమెరాలో చిన్నారి, వారి పెంపుడు కుక్క పరుగులు పెడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇక చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.






