Video: 8 మందిపై పెంపుడు కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామ‌స్తులు

by velandi.Saikiran |

శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండలం, మదూడి ఎస్సీ కాలనీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రోజున అక్కడే నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క, ఎస్సీ కాలంలో ఉన్న జనాలపై దాడి చేసింది. మొత్తం 8 మందిపై ఈ పెంపుడు కుక్క దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే మిగిలిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది ఆ కుక్క. దీంతో ఆ గ్రామస్తులు అందరూ ఏకమై, పెద్ద పెద్ద కర్రలతో ఆ కుక్కను కొట్టి చంపారు.

Video: 8 మందిపై పెంపుడు కుక్క దాడి.. కొట్టి చంపిన గ్రామ‌స్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ కుక్క దాడి చేస్తుందో ? అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. చిన్నపిల్లలే కాదు కుక్కలంటే పెద్దవాళ్ళు కూడా గజగజ వణికి పోతున్నారు. కుక్క కరవడం కారణంగా ఈ మధ్యకాలంలో చాలా మంది మరణిస్తున్నారు. దీంతో పెద్దవాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ పెంపుడు కుక్క చేసిన అరాచకానికి ఊరంతా ఏకం కావాల్సి వచ్చింది.

8 మంది పై పెంపుడు కుక్క దాడి

ఏకంగా 8 మంది పై పెంపుడు కుక్క దాడి చేసిందట. దీంతో ఊరంతా ఏకమై, ఆ పెంపుడు కుక్కను దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండలం, మదూడి ఎస్సీ కాలనీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రోజున అక్కడే నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క, ఎస్సీ కాలంలో ఉన్న జనాలపై దాడి చేసింది. మొత్తం 8 మందిపై ఈ పెంపుడు కుక్క దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే మిగిలిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది ఆ కుక్క. దీంతో ఆ గ్రామస్తులు అందరూ ఏకమై, పెద్ద పెద్ద కర్రలతో ఆ కుక్కను కొట్టి చంపారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

కుక్కను చంపడంపై రియాక్ష‌న్స్‌

పెంపుడు కుక్క‌ను దారుణంగా గ్రామ‌స్తులు దారుణంగా కొట్టి చంప‌డంపై నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. ర‌ష్మి లాంటి వాళ్లు, ఆ గ్రామాస్తుల‌ను తిడుతుంటే, మ‌రికొంత మంది ఆ గ్రామాస్తులకు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. ఇలాంటి కుక్కల‌ను చంపితే, త‌ప్పేముంద‌ని అంటున్నారు. ఆ కుక్క యజమానిని మ‌రికొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. అత‌ని నిర్ల‌క్ష్యం వ‌ల్లే, ఇది జ‌రిగింద‌ని ఫైర్ అవుతున్నారు. క్లిక్

Next Story