PPP విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వంపై మరోసారి పేర్నినాని విరుచుకుపడ్డారు...

MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges) నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికారి పార్టీ, వైఎఎస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం మరింత పెరిగింది. పీపీపీ(PPP) విధానంలో మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లకు మిశ్రమ స్పందన రావడానికి వైసీపీ నేతలే కారణమని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తుంటే వారికి వైసీపీ శ్రేణులు అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు మెడికల్ కాలేజీలను ప్రైవేటకరణ చేయొద్దని, ప్రభుత్వమే నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తాజాగా సైతం విరుచుకుపడ్డారు. వైద్యాన్ని ప్రైవేట్‌పరం చేయాలని సర్కార్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను చంద్రబాబుకు పట్టడంలేదని విమర్శించారు. ‘‘ పీపీపీ, పీ4తో ఎవరు బాగుపడ్డారో వారికే తెలియాలి. 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. గూగుల్, TCS ఇంత చౌకగా ఎక్కడైనా భూములు తీసుకుందా?. పేద్దోళ్ల పేరుతో భూములు దోచుకుంటున్నారు. రాజధాని రైతులను CRDA పట్టించుకోవడంలేదు.’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Next Story