పవన్‌ను చూస్తే బాలయ్యకు కడుపుమంట.. చిరంజీవి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : పేర్ని నాని

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-26 07:36:49  IST  )

పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపుమంటగా ఉంటోందని, సీఎంతో సమానంగా.. డిప్యూటీ సీఎం పదవిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.

పవన్‌ను చూస్తే బాలయ్యకు కడుపుమంట.. చిరంజీవి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : పేర్ని నాని
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపుమంటగా ఉంటోందని, సీఎంతో సమానంగా.. డిప్యూటీ సీఎం పదవిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. నిన్న (గురువారం) అసెంబ్లీలో జగన్ సైకో అని చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. అసలు పెద్ద సైకో బాలకృష్ణ అని, ఎన్టీఆర్ బసవ తారకమ్మ వంటి వారి కడుపున పుట్టి అసెంబ్లీలో నీఛపు మాటలు మాట్లాడుతున్నారా ? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బాలకృష్ణలాంటి వారికోసం బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ నోటికొచ్చిందల్లా మాట్లాడారని, చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొగిడే సరికి తన సైకో ఆలోచనల్ని బయటపెట్టారని విమర్శించారు. ఆనాడు అఖండ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచి సహాయం చేయాలని సీఎం హోదాలో జగన్ ఆదేశించారని గుర్తుచేశారు.

చిరంజీవి - జగన్ ల మధ్య సోదర బంధం ఉందన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించడాన్ని స్వాగతిస్తున్నానన్న పేర్ని నాని.. సినిమాలపై వైఎస్ జగన్ హయాంనాటి జీఓనే నేటి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. ఇక సినిమాలు, వాటి టికెట్ రేట్లు, సినిమావాళ్ల గురించి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. మంత్రి పదవి కోసమే కామినేని ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సత్యకుమార్ ను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ పదవి తనకు వస్తుందన్న ఆశతోనే కామినేని సినిమా వాళ్లపై వ్యాఖ్యలు చేశారన్నారు.

Next Story