- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందుల ZPTC గెలిస్తే ఎంత, ఓడితే ఎంత.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు
పులివెందుల ఉపఎన్నికల్లో వైసీపీ నాయకులపై దాడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, మండల నాయకుడు రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల ఉపఎన్నికల్లో వైసీపీ నాయకులపై దాడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, మండల నాయకుడు రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దాడి జరిగిన అర కిలోమీటర్ దూరంలో పోలీసులు ఉన్నారని, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందన్నారు. రామును చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పోలీసులు వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారని, మేమే చేర్చామని చెప్పడానికే ఇలా చేశారన్నారు. ఎమ్మెల్సీ గ్రామంలోకి వెళుతుంటే మీకు స్పృహ లేదా అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెట్పీటీసీ ఉప ఎన్నిక గెలిపించుకునేందుకే చంద్రబాబు రౌడీ ఇజం చేయడానికి సిద్దంగా ఉన్నారని ముందే ఈసీకి, డీసీపీకి ఫిర్యాదు చేశామన్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఓడితే ఎంత గెలిస్తే ఎంత అని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని చూసుకుందామని సవాల్ చేశారు. వైసీపీ ప్రచారం చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారం ఉందని కన్ను మిన్ను కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు సినిమాల్లో మాత్రమే చూసుంటామని ఆరోపించారు. కార్లు ధ్వంసం చేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారని రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ చూస్తూ ఊరుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.






