- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amaravathi : అమరావతి పాలనా భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు
రాజధాని నిర్మాణంలో భాగంగా, పాలనా భవనాల నిర్మాణానికి నేడు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని నిర్మాణంలో భాగంగా, పాలనా భవనాల నిర్మాణానికి నేడు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) రూ.3,673 కోట్ల విలువైన పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈ పనుల్లో 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) భవనం, మొత్తం 5 ఐకానిక్ టవర్లతో 68.88 లక్షల చదరపు అడుగులలో రూ.4,688 కోట్లతో ఇతర భవనాల నిర్మాణం ఉన్నాయి. గతంలో 2015లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ విధానంతో నిర్మాణాలు నిలిచిపోగా.. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రూ.24,276 కోట్లకు ఆమోదం పొందిన పనులతో పాటు, మొత్తం రూ.45,249.24 కోట్ల పనులకు అనుమతులు జారీ చేసినట్లు మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.13,000 కోట్ల రుణం, కేంద్రం నుంచి రూ.1,500 కోట్ల గ్రాంట్‌తో నిధులు సమకూరుతున్నాయి. రోడ్లు, డ్రైన్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. రైతుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా పనులు ముందుకు సాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.






