ఆ జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన.. హెలిప్యాడ్‌కు అనుమతి

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చి మామిడి రైతులను పరామర్శించనున్నారు.

ఆ జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన.. హెలిప్యాడ్‌కు అనుమతి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వచ్చి మామిడి రైతులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. వైసీపీ నేతలు అధికారులకు వివరాలు సమర్పించడంతో వారు ఆమోదం తెలిపారు. ఈ నెల(జూలై) 9న ఉదయం 11 గంటలకు మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు పయనమవుతారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Former CM Ys Jagan) ఇవాళ(సోమవారం), రేపు(మంగళవారం) వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్ పులివెందుల(Pulivendula)కు చేరుకోనున్నారు. ఆయన రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ తరుణంలో మంగళవారం ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుస్తారు.

Next Story