- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి.. గైడ్ లైన్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో బదిలీలు కోరుకునే.. ఉద్యోగులకు భారీ ఊరట లభించింది..
అయితే ఈ బదిలీల విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటి ప్రకారం.. ఒకే చోట ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి.. కూడా ఈ బదిలీలు ఉంటాయి.
వచ్చే సంవత్సరం మే 31వ తేదీ లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా అంధులైన ఉద్యోగులకు బదిలీలలో.. ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అధికారులు వెల్లడించారు. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ట్రైబల్ ఏరియాలలో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు.. ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది.






