జగన్ పొర్లు దండాలయాత్ర చేసినా ప్రజలు నమ్మరు.. ఎమ్మెల్సీ పంచుమర్తి

by Ramesh Naini |

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జగన్ పొర్లు దండాలయాత్ర చేసినా ప్రజలు నమ్మరు.. ఎమ్మెల్సీ పంచుమర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేయాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పందించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. జగన్‌ పాదయాత్ర కాదు.. పొర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తీవ్ర విమర్శలు గుప్పించారు. నాటి వైసీపీ అరాచక పాలనను తలచుకుంటేనే ప్రజలు వణికిపోతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని రాబంధుల్లా పీక్కుతిన్నారని మండిపడ్డారు. అప్పుడు ఇచ్చిన హామీలు అమలుచేయని జగన్‌.. ప్రజల్లోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి సుస్థిరపాలనను ప్రజలు కోరుకుంటున్నారని అనురాధ చెప్పారు.

Next Story