వైసీపీ ప్రభుత్వాన్ని తన్ని తరిమేయాలని ప్రజల్లో ఉంది: మాజీ మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

వైసీపీ ప్రభుత్వాన్ని తన్ని తరిమేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ప్రజల్లో ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్రభుత్వాన్ని తన్ని తరిమేయాలని ప్రజల్లో ఉంది: మాజీ మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని తన్ని తరిమేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ప్రజల్లో ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజు రేపేనని అన్నారు. దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూటమికే జై కొట్టాయని గుర్తు చేశారు. చంద్రబాబును సీఎంగా మళ్లీ చూసేందుకు బతుకుదెరువు కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల్లో పనిచేసే వారంతా స్వగ్రామాలకు వచ్చి ఓటేశారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ శాతం అధికంగా నమోదు కావడం అందుకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌ చేమబోతున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని.. వారెవరో తనకు తెలసని గంటా శ్రీనివాస రావు అన్నారు.

Next Story