నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. లారీ లోడ్ కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లిన జనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-19 09:09:17  IST  )

ఈ మధ్యకాలంలో ఫ్రీ అంటే జనం ఎగబడుతున్నారు. గంటలతరబడి వేచి చూసి మరీ తీసుకెళ్తున్నారు. అలాంటి కంటిముందు కూల్ డ్రింక్స్ కనిపిస్తే వదిలేస్తారా..?.. వదిలిపెట్టకుండా తీసుకెళ్తారు...

నెల్లూరులో రోడ్డు ప్రమాదం..  లారీ లోడ్ కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లిన జనం
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ అంటే ఎగబడే జనం కళ్ల ముందు కూల్ డ్రింక్స్ కనిపిస్తే వదిలేస్తారా..?. మొహమాటం లేకుండా తీసుకెళ్లిపోతారు. అచ్చం అలాంటిదే మరోసారి కూడా జరిగింది. నెల్లూరు జిల్లా(Nellore District) బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. అయితే ఈ లారీలో ఉన్న కూల్ డ్రింక్స్ మొత్తం రోడ్డుపై పడిపోయాయి. దీంతో లారీ చుట్టూ జనం గుమిగూడారు. లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌ను రక్షిస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ అలా చేయలేదు. రోడ్డుపై పడిపోయిన కూల్ డ్రింక్స్ తీసుకెళ్లే పనిలో పడ్డారు. దొరికినన్ని కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఎత్తుకెళ్లారు. పది నిమిషాల్లో మొత్తం ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కూల్ డ్రింక్స్ తీసుకెళ్లిన జనంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. డ్రైవర్‌ను కాపాడాల్సింది పోయి.. మాన‌వ‌త్వం మ‌రిచిపోయారంటూ మండిపడుతున్నారు.

కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్తున్న వీడియో

Next Story